యవ్వనమైన స్కిన్ కోసం టమాటాను ఇలా అప్లై చేసుకోండి..!

సాధారణంగా ఫేస్ గ్లోగా రావడానికి అనేక క్రీమ్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో నేచురల్ గా ఫేస్ని గ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కా పూర్తిగా విటమిన్లు, న్యూట్రన్స్ తో నిండి స్కిన్కు మంచి పోషణ ఇస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మృతకణాలను దూరం చేస్తుంది. అలాగే ఆయిల్స్కిన్ దూరం చేయడంలో ఈ టమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది.

పింపుల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే టమాటో వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. సన్‌టాన్ నుంచి విముక్తి పొందడమే కాకుండా.. సూర్యరశ్మి నుంచి స్కిన్ కాపాడుతుంది. యవ్వనమైన చర్మం కావాలంటే మీరు టమాటాను అప్లై చేసుకోవడం ఉత్తమం.

చర్మాని హైడ్రేట్స్ చేయడంలో కూడా టమాటా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టమాటా ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అందువల్ల కేవలం వారానికి రెండు నుంచి మూడు రోజులు అయినా ఈ టమాటా ని ఫేస్ కి అప్లై చేయడం మంచిది.