అందరితో జాలీగా మాట్లాడే తారక్.. ఆ డైరెక్టర్ తో మాత్రం చచ్చినా మాట్లాడడు..ఎందుకో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ కి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంతమంది ఇండస్ట్రీలో హీరోలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే .. ఆయన సినిమాకి సంబంధించిన అప్డేట్ రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా అంతా కాదు . సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి అందరి హీరోల కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ..ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ తో మాట్లాడడం లేదు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో మాట్లాడట్లేదు అంటూ తెలుస్తుంది. దానికి కారణం దమ్ము . వీళ్ల కాంబోలో వచ్చిన సినిమా “దమ్ము”. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే చెత్త రికార్డులు క్రియేట్ చేసింది. పరమ చెత్త టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా కథను వివరించేటప్పుడు బోయపాటి శ్రీను ..

ఎన్ టీఆర్ కి బాగా ఎక్కువగా వివరించారట . కానీ తెరకెక్కించేటప్పుడు చెత్తగా తెరకెక్కించారట . ఎడిటింగ్ లో చాలా మంచి సీన్స్ లేపేసారట . దీంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చి అప్పటినుంచి బోయపాటితో మాట్లాడడమే మానేశారట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . అంతేకాదు ఆయన నెంబర్ బ్లాక్ కూడా చేసేసారట. ప్రజెంట్ ఎన్ టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు.