పెళ్లైన మూడు నెలలకే ఐదు నెలల కడుపు.. ఎలా సాధ్యం బ్రో ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది . పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పేయడం.. లేదా పెళ్లయిన రెండు నెలలకే ఐదో నెల అంటూ ప్రకటించడం . చాలా చాలా కామన్ గా వింటున్నాం . గతంలో హీరోయిన్ ఆలియా భట్ పెళ్లయిన రెండు నెలలకి మూడో నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సరికొత్త కల్చర్ కి పద్ధతికి శ్రీకారం చుట్టింది .

అయితే ఇప్పుడు అదే ప్రొసీజర్ ని ఫాలో అయిపోతున్నారు పలువురు హీరోయిన్స్. రీసెంట్ గా హీరోయిన్ అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నవంబర్లో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరిగింది. అయితే నవంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు అభిమానులకి బంపర్ గుడ్ న్యూస్ అందించారు . అమలాపాల్ ప్రెగ్నెంట్. రీసెంట్ గా ఆమె బేబీ బంప్ కి సంబంధించిన ఫోటో షేర్ చేసింది.

అయితే ఈ ఫొటోస్ లో ఆమె బేబీ బంప్ చూస్తుంటే ఆమెకు ఐదు నెలలు దాటేసినట్లు కనిపిస్తుంది . నవంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు అప్పుడే ఐదు నెలలు ఎలా దాటేశాయా..?? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అంతేకాదు కొందరు వెటకారంగా ఇది ఎలా సాధ్యం బ్రో అంటూ జగత్ కు నాటి కామెంట్స్ పెడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో అమలాపాల్ ప్రెగ్నెన్సీ న్యూస్ వైరల్ అవుతుంది..!!