చీటింగ్ చేసిన బాయ్ ఫ్రెండ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన లవర్.. దెబ్బకి యువకుడు షాక్..!

ఇటీవల చాలామంది యువతి యువకులు ప్రేమించుకుని పెళ్లిళ్లు సైతం చేసుకుంటున్నారు. మరి కొంతమంది బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు కూడా. ఇక ప్రస్తుతం ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో మోసపోయి మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమను మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓ యువతి తనను మోసం చేసిన వ్యక్తిపై వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అసలు మేటర్ లోకి వెళితే. అమెరికాలో ఏవా లూయీ అనే యువతి హో యువకుడు ప్రేమించుకున్నారు. కానీ సడన్ గా ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు. దీంతో ఈమె కోపంతో ఊగిపోతూ అతనిపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేసింది. ఓసారి ఏవా బాయ్ ఫ్రెండ్ తాను ట్యాక్స్ ఎగ్గొట్టిన విషయాన్ని తనకు చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంది. ఈ క్రమంలో బాయ్ ఫ్రెండ్ పన్ను ఎగ్గొట్టిన విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పింది. దీంతో ప్రభుత్వం ఆమెకు రూ. 83 లక్షల డబ్బులను బహుమతిగా ఇచ్చింది.

ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం.. పన్ను ఎగ్గొట్టిన వారి వివరాలు బయట పెడితే.. ప్రభుత్వం వారికి కొంత డబ్బు ఇస్తుంది. ముఖ్యంగా నచారణ పొందాలంటే.. ఎగ్గొట్టిన పన్ను రెండు మిలియన్ డాలర్లకు పైబడి ఉండాలి. తప్పించుకున్న వారి కానుండి అధికారులు రికవరీ చేసిన డబ్బులలో సుమారు 30% వారి గురించి చెప్పిన వారికి ఇస్తారట. ఇక ప్రస్తుతం ఈ విషయం బయట పెట్టడంతో ఈమె కి డబ్బు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు.. బాయ్ ఫ్రెండ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చావుగా.. యువర్ రాక్స్ బేబీ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.