వాట్..సలార్ 2 లో ప్రభాస్ నాన్న గా నటించబోయేది ఆయనేనా..? రొమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ సలార్ సలార్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు మారు మ్రోగిపోతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రీసెంట్గా నటించిన సినిమానే ఈ సలార్. కే జి ఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది . చరిత్రను తిరగరాసింది . ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ దక్కించుకుంది.

మరీ ముఖ్యంగా సలార్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా “ధారా” అనే వ్యక్తిని ఫుల్ గా చూపించకుండా సైడ్ కట్లో చూపిస్తాడు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. చాలామంది ఈ రోల్ ప్రభాస్ చేయబోతున్నాడు అని అంటుంటే మరికొందరు కాదు కాదు ఈ రోల్ కోసం మలయాళీ నటుడిని రంగంలోకి దించుతున్నాడు ప్రశాంత్ నీల్ అంటున్నారు.

కానీ సోషల్ మీడియాలో ఎక్కువమంది ఈ పాత్రను ప్రభాస్ నే చేయబోతున్నాడు అని ఆ బ్యాక్ యాంగిల్ మొత్తం ప్రభాస్ దే అని సినిమా స్టార్టింగ్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్ పిక్చర్ ని ఈ పిక్చర్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఒకవేళ అదే అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే ..దిమ్మతిరిగి పోవాల్సిందే.. సలార్ వెయ్యి కోట్లు పక్కా అంటున్నారు జనాలు..!!