అత‌డితోనే సంయుక్త మీన‌న్ పెళ్లి… పేద్ద రిస్క్ చేస్తోందిగా…!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమె అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులని ఆకట్టుకుంది. ఇక వరుస హిట్లను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ డిసెంబర్ 29న ” డెవిల్ ” మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఏక్కపోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. గత కొద్దిరోజులుగా ఓ అబ్బాయి తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పగా వాళ్లు కూడా ఓకే అన్నారట. అయితే సంయుక్త పెళ్లి చేసుకోబోతుంది వేరే మతానికి చెందిన అబ్బాయి అట.

దీంతో పెళ్లి తర్వాత తన పేరు చివర ఉన్న ట్యాగ్ కూడా తీసేస్తుందట. ఇక అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ డెవిల్ మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ కి ఓకే చేయలేదు. ఇక దీని బట్టి చూసుకుంటే ఈమెకి ఇదే ఆఖరి సినిమా అయ్యుండొచ్చు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు…” కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏంటీ? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ” అంటూ ఫైర్ అవుతున్నారు.