స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . తొలి సినిమాతోనే రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ కి బడా హీరోలు ఎందుకో అవకాశాలు ఇవ్వలేకపోయారు .

ఆర్ఎక్స్ 100 తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మారాయి. కేవలం మంగళవారం సినిమా మాత్రమే హిట్ టాక్ అందుకుంది. కాగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్పుత్ .. రీసెంట్గా పెట్టిన పోస్ట్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తుంది . ఆమె తన పెట్ డాగ్ ను కోల్పోయింది . ఈ మేరకు తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎమోషన్ల్ అయ్యింది.

“క్షమించు క్యాండి.. ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది .. చాలా చాలా బాధగా ఉంది . గుండెలు పగిలిపోతున్నాయి. నువ్వు లేకుండా నేను ఉండలేను . ఐ మిస్ యు అంటూ చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది”. తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేసింది . ప్రెసెంట్ ఈ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!