“2023లో నన్ను బాగా సంతోషపెట్టిన విషయం అదే”.. నిహారిక సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

నిహారిక .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . మొదట యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అభిమానులు ఆమెను ఎంకరేజ్ చేయలేకపోయారు . ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ కొట్టలేకపోయింది .

ఫైనల్లీ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలనుకునింది . పెళ్లి చేసుకునింది కానీ లైఫ్ లో మాత్రం సెటిల్ కాలేకపోయింది. భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకొని ప్రజెంట్ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాగా నిహారిక 2020లో తన భర్త నుండి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఆ టైంలో ఆమెను బాగా ట్రోల్ కూడా చేశారు మెగా హేటర్స్ .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. నిహారిక “2023లో నన్ను బాగా సంతోషపెట్టిన విషయం ఇదే ” అంటూ ఖతక్ డ్యాన్స్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ తో నిహారిక చాలా క్యూట్ గా ఉంది. చాలా ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. మెగా అభిమానులు ఈ ఫోటో పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . ఎప్పుడు నిహారిక ను బూతులు తిట్టే జనాలు సైతం నిహారిక పోస్ట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)