వావ్: కలలో కూడా ఊహించని ఛాన్స్..బంపర్ ఆఫర్ కొట్టేసిన “త్రిప్తి డిమ్రీ”..!!

“తృప్తి డిమ్రి” నిన్న మొన్నటి వరకు ఈ పేరుకి పెద్దగా పరిచయాలు లేవు. ఈ పేరు చెప్తే జనాలు కూడా చాలా టైం తీసుకునే వాళ్ళు . గుర్తుపట్టడానికి ఎవరా అంటూ అరగంట సమయం కేటాయించేవాళ్లు . అయితే సందీప్ రెడ్డి వంగా పుణ్యమంటూ ఈ బ్యూటీ పేరు ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయింది. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ చాలా బోల్డ్ పాత్ర కావడంతో కుర్రాళ్ళు తెగ ఫిదా అయిపోయారు.

యానిమల్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లాంటి హీరోయిన్ నటించిన కూడా అందరూ తృప్తి డ్ర్మ్రి పేరు జపిస్తున్నారు అంటే దానికి రీజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా ర్ట్ప్తి ఇప్పుడు తెలుగులో బడా ఆఫర్ పట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది . సుకుమార్ – రాజమౌళి -ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్న త్రివిక్రమ్ పేరు చెప్తే మాత్రం జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు .

అలాంటి పర్ఫామెన్స్ అలాంటి క్రేజ్ దక్కించుకున్నాడు . త్రివిక్రమ్ నెక్స్ట్ బన్నీతో ఓ మూవీని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో తృప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట . త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్రలో తృప్తి కనిపించబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది..!!