“అదే నిజం అని ప్రూవ్ చేయడానికి ..మందు కొట్టి శివాలయానికి వెళ్లిన రాజశేఖర్” .. ఆయన డేర్ కి హ్యాట్సాఫ్..!!

యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రాజశేఖర్ . నేటి జనరేషన్ కి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కానీ మన ఇంట్లోనే అమ్మమ్మలకు తాతలకు మాత్రం రాజశేఖర్ అంటే దేవుడులా కనిపిస్తాడు. అప్పట్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలంటే ముందుగా అందరూ ఆయన ఇంటి తలుపులే కొట్టేవాళ్ళు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అలాంటి రాజశేఖర్ శివాలయానికి మందు కొట్టి వెళ్ళాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర్ చేసిన కామెంట్స్ ను మరోసారి ట్రెండ్ జనాలు . రాజశేఖర్ కి సినిమా ఇండస్ట్రీ లోకి రావడం ఇష్టం లేదు . నాన్న కోసమే వచ్చాడు . అయితే వచ్చిన తర్వాత మాత్రం ఇష్టంగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు . రాజశేఖర్ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడట . ఐదేళ్లు ఆమె వెనకాలే తిరిగాడట . అయితే ఆమె మాత్రం రిజెక్ట్ చేసిందట .

దీంతో ఫుల్ కోపం తెచ్చుకున్న రాజశేఖర్ ఫుల్ గా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం స్టార్ట్ చేశారట . అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దేవుడికి దండం పెట్టుకో కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది అంటూ చెప్పాడట . అయితే దేవుడిపై నమ్మకం లేకుండానే గుడికి వెళ్లిన రాజశేఖర్..” సారీ దేవుడా మందుకొట్టి ఆలయానికి వచ్చాను .. నువ్వు ఉన్నావు అంటూ ప్రూవ్ చేసుకోవాలి .. నేను నిన్ను నమ్మాలి అంటే నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యు చెప్పాలి . అప్పుడు నువ్వు దేవుడివి అని నమ్ముతాను లేకపోతే రాయివే అనుకుంటాను” అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారట. ఆశ్చర్యమేంటంటే మూడు నెలల్లోనే అమ్మాయి వచ్చి రాజశేఖర్ కి ఐ లవ్ యు చెప్పడమే కాకుండా చాలా బాగా ఆయనతో మాట్లాడిందట . దీంతో రాజశేఖర్ సైతం షాక్ అయిపోయారట..!!