“యస్..ఆ విషయంలో ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చా..నిజమే”.. సలార్ నటి షాకింగ్ కామెంట్స్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీన్స్ .. వైలెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది . అందుకే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి పడేశారు జనాలు . ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన వార్తలను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ .

అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ సలార్ సినిమాలో నటించిన శ్రేయా రెడ్డి ఆయనపై చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి . ప్రభాస్ మంచి ఫుడీ..ఫుడ్ పిచ్చోడు అంటారు అందరూ ..ఆయనతో వర్క్ చేసే వాళ్లకు కూడా తన ఫుడ్ టెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే సలార్ టీం కి కూడా తన ఇంటి ఫుడ్ టెస్ట్ చూపించాడట . అయితే ప్రభాస్ అంటే ఏంటో తెలిసిన శ్రేయ రెడ్డి ముందు నుంచి జాగ్రత్త పడిందట.

ఆయన ఫుడ్ పెడితే తినకూడదు అంటూ చాలా స్ట్రిక్ట్ గా ఉండిందట . ఫిట్నెస్ ఫ్రీక్ గల ఈమె డైట్ ఏ రోజు కూడా మిస్ అవ్వదు. “అలాంటి ఆమె దగ్గరికి వచ్చి ప్రభాస్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి..? చెప్పు చెప్పు అంటూ విసిగిచ్చాడట . అప్పటికి స్వీట్స్ అంటూ ఇష్టంగా చెప్పేసిందట. అయితే స్వీట్స్ తీసుకు వస్తాను అంటే ” నీకు దండం రా బాబు నేను ఈ షూట్లో ఉన్నంతవరకు నా ఫిట్నెస్ ని పాడు చేయొద్దు” అంటూ సరదాగా కామెంట్ చేసిందట . ప్రభాస్ కూడా ఓకే బతికిపోయావ్ పో అంటూ సరదాగానే కామెంట్ చేశాడట . ప్రజెంట్ ఇదే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!