ఓజి మూవీ పై సలార్ నటి సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన స‌లార్‌ మూవీ ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే మంచినీళ్లు తాగినంత సులువుగా రూ.500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.. ఇక వెయ్యి కోట్ల మార్క్ను ఈజీగా ఈ సినిమా దాటేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రాధా రమా క్యారెక్టర్ ని పోషించిన శ్రియ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈమెకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పోషించిన పాత్ర ప్రబాస్ తర్వాత హైలైట్ గా ఉండడంతో ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక శ్రేయ రెడ్డి సలార్‌ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాలో నటించబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన శ్రేయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. సలార్ సినిమా కంటే ఓజి సినిమా రెండు మూడు రెట్లు ఇంకా ఎక్కువ కిక్ ఇవ్వబోతుంది.. అంటూ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఓజి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంటే ఆమె చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్ర‌భాస్ మూవీ కంటే ప‌వ‌న్ మూవీ పెద్దది అని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్‌ తో మంచి పాపులారి ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఓజీతో సక్సెస్ అందుకుంటే మరింత మంచి ఫ్యూచర్ ఉంటుంది.