రాసి పెట్టుకోండి..2024 లో ఈ హీరోల తల రాతలు పూర్తిగా మారిపోబోతున్నాయి..!

హమ్మయ్య .. సక్సెస్ఫుల్ 2023కి మరికొద్ది గంటల్లో గుడ్ బై చెప్పేస్తున్నాం .. కేవలం మరికొద్ది గంటలు అంటే కొద్ది గంటలే 2024 కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పబోతున్నాం . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి . కాగా 2023లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి . హిట్లు కొట్టాయి ఫ్లాపులు పడ్డాయి. అయితే 2024 మాత్రం సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకంగా కీలకంగా మారిపోబోతుంది.

ఒకటి కాదు ఇద్దరు కాదు ఏకంగా 6 మంది స్టార్ హీరోల సినిమాలు ఈ ఇయర్లో రిలీజ్ కాబోతున్నాయి . ఎస్ జనవరి 12న గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది. మహేష్ కెరీర్ కి ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ . అదే విధంగా ఏప్రిల్ 5 , 2024న దేవర సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టులో పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమాతో బన్నీ చరిత్ర సృష్టించబోతున్నాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆ తర్వాత సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరంలోనే కల్కి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ మరో హిట్ తో రెడీగా ఉండబోతున్నాడు . అదేవిధంగా నాగర్జున – – బాలకృష్ణ- చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఇదే సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి . అందుకే ఈ2024 సినిమా ఇండస్ట్రీకి ఎంతో కీలకంగా మారబోతుంది..!!