ప్రతి సినిమాలోనూ అదే తప్పు.. కళ్యాణ్ రామ్ ను నిండా ముంచేస్తుంది ఆ ఒక్కటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా డెవిల్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ హిట్ టాక్ దక్కించుకుంది . నిజానికి డెవిల్ సినిమాపై అభిమానులు చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు . దానికి కారణం ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఈ మధ్యకాలంలో రాకపోవడం పైగా నందమూరి హీరో ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం . ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది .

పాజిటివ్ టాక్ అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం కళ్యాణ్ రామ్ కి ఊహించిన షాక్ ఇచ్చింది డెవిల్ సినిమా . ఆయన రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ అందుకోలేకపోయింది . కేవలం రెండు కోట్ల 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడం అభిమానులను తీవ్రంగా హార్ట్ చేసింది . నిజానికి బింబిసారా తర్వాత అలాంటి హిట్ అందించబోయే సినిమా డెవిల్ అంటూ అంతా అనుకున్నారు . కానీ డెవిల్ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయమే ఆయన కొంప ముంచేసింది అంటున్నారు జనాలు.

సినిమా కంటెంట్ చాలా బాగుంది. కథ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది . అయితే ఆ కథను జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో తప్పటడుగులు వేశారు . మొదటి పార్ట్ అంతా ఇంట్రడక్షన్ ఇస్తూ ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయేలా చేసిన డైరెక్టర్ క్లైమాక్స్ మాత్రం చిన్న పిల్లలు కూడా ఊహించే విధంగా రాసుకున్నాడు. అదొక్కటే మైనస్ అయింది . కేవలం ఈ సినిమానే కాదు అమిగోస్ లో కూడా అదే తప్పు చేశాడు. గతంలో కళ్యాణ్ రామ్ నటించిన చాలా సినిమాల విషయంలోనూ క్లైమాక్స్ చాలా సింపుల్ గా ఫినిష్ చేసేసాడు . అందుకే ఆయన సినిమాలు పెద్దగా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయాయి అంటున్నారు జనాలు . అంతేకాదు కళ్యాణ్రామ్ సరైన హిట్ కొట్టాలి అంటే బింబిసార 2 రావాల్సిందే అంటున్నారు..!!