వరుణ్-లావణ్య ల మధ్య ప్రేమ పుట్టడానికి – పెళ్లి చేసుకోవడానికి కారణం.. ఆ విడాకులు తీసుకున్న హీరోయినా..?

వాట్ ..వరుణ్ – లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి ఆ హీరోయిన్ కారణమా ..? ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు . ప్రజెంట్ హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు .

కాగా వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి హీరోయిన్ సమంత కారణమన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది . దానికి కారణం వరుణ్ తో ఆమె చేయాల్సిన సినిమా మిస్ చేసుకోవడమే. వరుణ్ లావణ్య ఫస్ట్ టైం కలిసింది మిస్టర్ అనే సినిమా సెట్స్ లో . అంతకు ముందు వీళ్ళిద్దరికీ అసలు పరిచయమే లేదు . అయితే ఈ సినిమాలో నటించడం ద్వారానే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ..అది కాస్త ప్రేమగా మారింది .

ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోయారు . అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట డైరెక్టర్ . ఆమె రిజెక్ట్ చేయడంతోనే ఆ పాత్ర లావణ్య కు వెళ్ళింది . అలా పరోక్షకంగా తనకు తెలియకుండా హీరోయిన్ సమంతనే వరుణ్ లావణ్య ప్రేమకు పెళ్లికి కారణమైంది అనమాట. మొత్తానికి సమంత తన భర్త దగ్గర నుండి విడాకులు తీసుకున్న ఆమె మాత్ర ఓ జంటను కలిపి ఆ పుణ్యాని మూఠ కట్టుకున్నింది..!!