హనీమూన్ లో అలా చేస్తున్న మెగా జంట… ముందే మొదలు పెట్టేసారుగా…!!

డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకుంటారు. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీలు కూడా బాగా నవ్వుతూ .. వారు కూడా ఈ పండగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

ఇక ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ముందుగానే ప్రారంభించినట్లు తెలుస్తుంది. లావణ్య, వరుణ్ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటూ.. నవంబర్ ఒకటవ తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ జంట ఫిన్లాండ్ హనీమూన్ వెకేషన్ లో ఉన్నారు.

ఇక హనీమూన్ వెకేషన్ లోనే వీరిద్దరూ క్రిస్మస్ వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే లావణ్య క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలపై అనేకమంది వివిధ రకాలగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.