మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఆ స్పెస‌ల్‌ సాంగ్ పై క్లియర్ అప్డేట్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ..” గుంటూరు కారం”. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలోని ” ఓ మై బేబీ ” సాంగ్ ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని 2వ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల కానుంది. ఇక మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులందరికీ ఇది కచ్చితంగా సంతోషకరమైన వార్త. ఇక ఈ మూవీ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12, 2024న రిలీజ్ కానుంది.

ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటున్నారు చిత్ర బృందం. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుండగా.. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఈ పాట ఎంతమంది ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూద్దాం.