ప్రగతి ఆంటీ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరే..

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్‌ సంపాదించుకుంది ప్రగతి. స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్ లో పాలు రికార్డ్స్ బ్రేక్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప‌లు మూవీస్‌లో అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎన్నో పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగతి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది. అదేవిధంగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటుంది.

Ragalahari on X: "Actress #Pragathi daughter Geetha celebrates her 17th  Birthday today. Here's a pic from #Geetha Birthday celebrations.  #PragathiMahavadi #birthday #birthdaygirl #tollywoodactress #Tollywood  #TeluguCinema https://t.co/Iy2ZZfrRhF" / X

అంతేకాదు త‌న‌ అందంతోను కుర్రాళ‌ను కవ్విస్తూ ఉంటుంది. ఇటీవల జాతీయ స్థాయిలో సత్తా చాటిన ప్రగతి ఫిట్నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఆమెకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బెంగళూరులో 28వ బ్రాంచెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో పాల్గొన్న ప్ర‌గ‌తి మూడో స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ప్రగతి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఆమె కూతురు అంత‌కు మించి అందంతో మెరిసింది. ఇక ప్ర‌గ‌తి కూతురు పేరు గీతా.

Photos of actress Pragathi's daughter are going viral on the occasion of  daughters day..!

తల్లికి తగ్గట్టుగా ఈ బ్యూటీ కూడా న‌ట‌న‌తో మెప్పిస్తే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నేలా ఉంది.. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఎంతో ముద్దుగా తన క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రగతి తన కూతురితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మీ కంటే మీ కూతురు చాలా అందంగా ఉంది ప్ర‌గ‌తి ఆంటీ అంటూ.. స్టార్ హీరోయిన్స్ కంటే కూడా మీ పాప చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది అంటూ.. తను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మంచి సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.