” శంకర్ దాదా జిందాబాద్” మూవీ హీరోయిన్ గుర్తుందా…. ఇప్పుడు ఈమె ముందు హీరోయిన్లు కూడా బలాదూర్…!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” శంకర్ దాదా జిందాబాద్ “. కరిష్మా కోట అనే హీరోయిన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో ఇక ఈ అమ్మడికి తెలుగులో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. అందం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మని తెలుగు ఇండస్ట్రీ ఆదరించలేకపోయింది.

కరిష్మా బ్రిటిష్ మోడల్. యూకే, ఇండియాలో మోడల్ గా కొన్ని యాడ్స్ లలో కూడా నటించింది. ఇక‌ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే స్టార్ హీరో సరసన నటించింది. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది.

ఇక ఈమె సినిమాలలో పెద్దగా రాణించలేక పోవడంతో లండన్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కి మించిన అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా నటించిన సమయంలో కన్నా ఇప్పుడు మరింత అంద వంతురాలుగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె.. కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంది.