యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా అడుగు పెట్టాడు.

Ranbir Kapoor looks intense in Animal poster, wife Alia ...

బాలివుడ్‌డికి వెళ్ళగానే సోదరుడు ప్రణయ్ రెడ్డిని అమెరికా నుంచి వెనక్కి రప్పించి మరీ తన సక్సెస్‌లో భాగం చేసుకున్నాడు. సినిమా ప్రొడక్షన్ బాధ్యతలు అన్నీ తమ్ముడికి అప్పగించాడు. యానిమల్ సినిమాకు స్టూడియో ఫండింగ్ అంత టి సిరీస్ బ్యానర్ వారు చూసుకున్నా.. నిర్మాణ బాధ్యతలు మాత్రం ప్రణయ్ రెడ్డి చూశాడు. దీంతో యానిమల్ సినిమాల్లో పార్ట్నర్ గా ఉన్న ప్రణయ్ రెడ్డికి సగానికి సగం వాటా వస్తుంది. ఇక టీ సిరీస్ సంస్థ సినిమాలని అమ్మడం కాదు అడ్వాన్సుల మీద పంపిణీ చేస్తూ ఉంటుంది.

సందీప్ రెడ్డి వంగాను సొంత అన్నయ్య ప్రణయ్ తప్ప ఎవరు భరించలేరా

ఈ సినిమాకి కూడా అలాగే పంపిణీ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆ ల‌క్క ప్ర‌కారం చూసుకుంటే వంగ కుటుంబానికి అటు ప్రాఫిట్స్ అన్నీ కలిపి రూ.200 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. ఇంతకంటే బంపర్ ఆఫర్ అసలు ఉండదు. ఇక పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ప్రఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుని ఉండడు. దీంతో ప్రస్తుతం యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.