బోల్తా కొట్టిన వేణు స్వామీ జాతకం..ఏకి పారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. అడ్డంగా దొరికిపోయావుగా బాసూ !!

అన్నివేళలు మన సమయాలు కాదు.. టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు వేణు స్వామి. స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి చెప్పిన జాతకం బోల్తా కొట్టడంతో రెబెల్ ఫాన్స్ ఏకిపారేస్తున్నారు.

మొదటినుంచి ప్రభాస్ అంటే ఇష్టం లేని వేణు స్వామి ఆయన లైఫ్ పై ఆయన పెళ్లి పై సంచలన కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ఆది పురుష్-రాధే శ్యామ్ సినిమాలో ఫ్లాప్ అవుతున్నాయని ముందే చెప్పిన వేణు స్వామి .. సలార్ కూడా డిజాస్టర్ గా మారబోతుంది అని అసలు ఆయన నమ్మి ప్రొడ్యూసర్స్ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అన్న కామెంట్స్ చేశాడు .

అయితే నేడు కొద్దిసేపటికి రిలీజ్ అయిన సలార్ సినిమా ఎలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందో మనం చూసాం. మరి అలాంటి సినిమాపై వేణు స్వామి ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అంతే కాదు కరెక్ట్ టైంలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఇక జాతకాలు ఆపేసి ఇంట్లో కూర్చొని చెక్కభజన చేసుకో అంటూ సలహా ఇస్తున్నారు..!!