కర్మ కర్మ..శుభమా అని మా ప్రభాస్ హిట్ కొడితే.. ఈ కొత్త తల నొప్పి ఏంట్రా నాయన..!

ఒకరు బాగుపడుతుంటే చూడలేక కిందకి లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే అలాంటి జనాలు కూసింత ఎక్కువగానే ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ప్రభాస్ కెరియర్ లోనే ఇలాంటి వైలెన్స్ ని ఎప్పుడు చూడలేదు అంటున్నారు రెబెల్ అభిమానులు .

అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ప్రభాస్ సినిమా హిట్ అవ్వకూడదు అంటూ ప్రత్యేకంగా హోమాలు వేయించాడు అన్న వార్త వైరల్ అయింది. దీంతో రెబల్ ఫాన్స్ మండిపడుతున్నారు .

మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ని తొక్కేయడానికి కొంతకాలం నుంచి ఇద్దరు హీరోలు ట్రై చేస్తున్నారు అన్న వార్త ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ క్రమంలోని సలార్ హిట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . లేక లేక శుభమంటూ మా అన్న హిట్ కొడితే నీ లొల్లి ఏంట్రా సినిమా హిట్ అవ్వకూడదు అని పూజలు చేస్తే ఫ్లాప్ అవుతుందా ..? మీరు తెరకెక్కించే చెత్త సినిమాలు కన్నా మా ప్రభాస్ అన్న నటించే సినిమాలు చాలా చాలా బాగుంటాయి అంటూ ఫైర్ అయిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.