” ప్రశాంత్ విషయంలో క్షమాపణలు కోరిన అశ్విని “… అసలేం జరిగిందంటే…!

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన అరెస్టుపై తోటి ఇంటి సభ్యులు స్పందించారు. వీరు స్పందిస్తూ పల్లవి ప్రశాంతి ది ఏమీ తప్పులేదు అంటూ క్షమించమని అడిగారు. ఇక తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని.. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈమె మాట్లాడుతూ…” పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ట్రోఫీ గెలిచాడే తప్ప పాపం ప్రశాంత్ ఏం చేశాడు. ప్రశాంత్ ను చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు ఫ్యాన్స్ వచ్చారు. వారి చేసిన పనికి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.

పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన ఆనందం కూడా లేకుండా చేశారు. ప్రశాంత్ ఏమన్నా మీతో అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటే తన తరుపున నేను క్షమాపణలు చెబుతున్న ” అంటూ ఎమోషనల్ అయింది అశ్విని. ప్రస్తుతం అశ్విని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.