సౌత్ లోనే ఆ రేర్ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్.. అదేంటంటే..?

నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ టైగ‌ర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మూవీ హాలీవుడ్ ప్రముఖులతో కూడా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ నుంచి నాటునాటు పాట ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఈ సినిమాతో ఈ కాంబోకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పటికే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్.. వెరైటీ గ్లోబల్ మీడియా మ్యాగజైన్‌లో మోస్ట్ ఇన్‌ఫ్లుయెనంస్‌డ్ పీపుల్గా 500 మంది పేర్లను సెలెక్ట్ చేసి ఆ లిస్టును రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితవంతమైన వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ప్లేసులు దక్కించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోనే ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్న మొదటి హీరో ఎన్టీఆర్ కావడం గమనార్హం. దీంతో ఎన్టీఆర్ క్రైజ్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోతుంది.