“ఎవ్వడు ఏం చేసిన.. మా ప్రభాస్ ని ఏం పీకలేడు”..తెలుగు హీరోని టార్గెట్ చేసిన రెబల్ ఫ్యాన్స్..!!

సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ప్రభంజనంలా మారుమ్రోగిపోతుంది . గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన ప్రభాస్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ కి.. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది . ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా అదరగొట్టేసింది .

మరీ ముఖ్యంగా రెబల్ అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలి అనుకున్నారో..? అలాగే చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనాలు . అయితే ప్రభాస్ సలార్ సినిమా హిట్ అయిన క్రమంలో కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . ఈ సినిమాలో పెద్దగా ఏమి లేదని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ హైలెట్ అని .. ప్రభాస్ నటన కూడా అంతంత మాత్రమే ఉంది అని.. ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ బాగా నటించారు అంటూ పలువురు యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

దీంతో రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ ..కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి.. ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మీకే అర్థమవుతుంది .. ఆయన ప్రభాస్ సినిమా హిట్ అయిందని మేము ఆనందంలో ఉంటూ ఉంటే మీ గోల ఏంట్రా అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది కావాలని సలార్ సినిమాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. దీనిపై కూడా ప్రభాస్ ఫాన్స్ మండిపడుతున్నారు.