” నేనొక హీరోయిన్ ని.. అయినా ఎవరు నన్ను ప్రేమించడం లేదు “…. నటి షాకింగ్ కామెంట్స్…!

అనన్య పాండే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం టాలీవుడ్లోకి సైతం అరంగేట్రం చేసింది. ఇక ఈమె తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ” ఖో గయే హమ్ కహాన్ ” తో ప్రేక్షకుల ముందుకి రానుంది.

డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మునిగిపోయారు చిత్ర బృందం. ఇక ఈ క్రమంలోనే అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో ఆమె పడిన కష్టాలను తెలియజేసింది. అనన్య పాండే మాట్లాడుతూ…” నేను పబ్లిక్ ఫిగర్ను. నా తల్లిదండ్రుల వారసత్వంగా నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో న సినీ కెరీర్ ని ప్రారంభించారు.

కిరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీలో నా ఫర్మార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాను. ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ సమయంలో అభిమానులు నన్ను ప్రేమించకపోవడం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుంది. చుంకీ పాండే నుంచి వచ్చిన వారసత్వం, గౌరవం పొందాలనుకున్న. కానీ నాకు ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. వాళ్లు నన్ను ప్రేమించడం లేదని తీవ్ర ఆందోళన చెందాను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.