స్పై బ్యాచ్ తో ఓ భారీ సినిమాని ప్లాన్ చేసిన శివాజీ.. మూవీ నేమ్ ఏంటంటే..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కామెడీకి ఎంతోమంది అభిమానులు సైతం ఉన్నారు. ఒకప్పుడు హీరోగా అనేక సినిమాలలో నటించినటువంటి ఈయన.. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నాడు శివాజీ.

ఇక తన ఆటతీరుతో ప్రేక్షకులని మెప్పించకపోయినా.. మాటతీరుతో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ షోలో పల్లవి ప్రశాంత్, యావర్ లకు సపోర్ట్ చేస్తూ స్పై బ్యాచ్ అనే ఒక బిరుదులు సైతం సంపాదించుకున్నారు ఈ ముగ్గురు. ఇక తాజాగా శివాజీ స్పై బ్యాచ్ తో ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ..” పల్లవి ప్రశాంత్, యావర్లతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ స్పై అనే సినిమాను ప్లాన్ చేశాను. ఇప్పటికే లైన్ కూడా సిద్ధమైంది. ఒక దర్శకుడు తో ఇందుకు సంబంధించిన చర్చలు సైతం జరుగుతున్నాయి ” అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.