న్యూ ఇయర్- న్యూ బిగ్గినింగ్స్- న్యూ రిలేషన్..ఫ్యాన్స్ కి శ్రీముఖీ గుడ్ న్యూస్ వినిపించబోతుందోచ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంతమంది యాంకర్స్ ఉన్న నెంబర్ వన్ యాంకర్ ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చేది సుమ. అయితే యంగ్ జనరేషన్ యాంకర్స్ లో అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం శ్రీముఖి . ఓ రాములమ్మగా ఓ లౌడ్ స్పీకర్ గా ఎనర్జిటిక్ యాంకర్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది . ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది .

Anchor Srimukhi Latest Photoshoot Pics

కాగా శ్రీముఖి పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . 2024 లో శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వచ్చిన శ్రీముకీ 2024లో ఎట్టి పరిస్థితులోను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట .

తన ఫ్రెండ్స్ వద్ద నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. న్యూ ఇయర్ – న్యూ బిగినింగ్స్ – న్యూ రిలేషన్షిప్ న్యూ హోప్స్ అంటూ ఆమె కొత్త బంధానికి సంబంధించిన సీక్రెట్ ను రివిల్ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఎప్పటిలాగే ఈ న్యూస్ ఫేక్ నా..? లేకపోతే నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? అన్నది తెలియాలి అంటే శ్రీముఖి నోరు విప్పాల్సిందే శ్రీముఖి తన పెళ్లి గుడ్ న్యూస్ చెప్తే వినాలి అన్నది అభిమానుల కోరిక చూద్దాం. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?