ఆడవాళ్ల కన్నీటికి అంతా పవర్ ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏం నిర్ధారించారంటే..

ఎంతటి వాడైనా కాంతదాసుడే అంటూ పెద్దవాళ్లు సామెత చెప్తూ ఉంటారు. దానీ అర్థం ఎలాంటి మగవాడైనా ఒక అమ్మాయి వాలు చూపులకు చిత్తు కావాల్సిందే. అయితే ఆడ‌వారి చూపులే కాదు.. ఆడవారికి కన్నీళ్ళకి కూడా అంతే పవర్ ఉంటుందని తాజాగా ఓ ఆసక్తికర అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా ఆడవాళ్లు ఎప్పుడైనా కన్నీరు కారిస్తే మగవాళ్ళకు మరింత చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. ఆ టైంలో వారి కోపాన్ని అసలు అంగీకరించని లేడీస్ మరింతగా బాధపడుతూ ఉంటారు.

అయితే ఆడవారి కన్నీళ్లను ఇష్టపడని మగాళ్లు ఆ కన్నీళ్ల వాసన త‌గిలితే మాత్రం దాసోహ‌మవుతారని అధ్యాయంలో తేలింది. తాజాగా ఇజ్రాయుల్‌కు చెందిన సైంటిస్టులు ఈ అంశానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆడవారి కన్నీళ్ళ వాసన పిలిస్తే ఎంత దూకుడుగా ఉండే మగవాడికైనా కళ్ళాలు పడతాయట. వారు శాంత స్వభావులుగా మారిపోతారని ఈ అధ్యాయం చెబుతుంది.

ఆడవాళ్లు ఏడుపు మగవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.. వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో ఆడవారి కన్నీటి లో ఉండే రసాయనాలు మగవారి మెదడుని తీవ్రంగా ప్రభావితం చూస్తాయని.. ఆ మగవాడిలోని దూకుడు స్వభావానికి చెక్ పెడ‌తాయ‌ని ఈ పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్లాస్ బయాలజీ జనరల్ వేదిక పబ్లిష్ చేసింది.