నేను ఒక సైకో గర్ల్ ఫ్రెండ్.. నా లవర్ ను వెంటపడి వేధిస్తుంటా.. లైగర్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

పాన్‌ ఇండియన్ స్టార్ బ్యూటీ అనన్య పాండే కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోకపోయినా.. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం అనన్య పాండే, సిద్ధాంత్‌ చతుర్వేది, ఆదర్శ గౌరవ్‌ మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న మూవీ కో గ‌యా హ‌మ్ క‌హా.. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రియల్ లైఫ్ కు దగ్గరగా ఉన్న తమ క్యారెక్టర్ విశేషాలను పంచుకోండి అంటూ మూవీ టీం ను ఇంటర్వ్యూవ‌ర్‌ అడిగాడు. దీనిపై స్పందించిన సిద్ధాంత్‌ ఆదర్శ్.. నిజ జీవితానికి సినిమాలో నా పాత్రకు అసలు పోలిక ఉండదని వివరించాడు. అనన్య మాత్రం నేను ఇందులో సైకో అబ్సెసీవ్‌ స్టాకర్ గర్ల్ ఫ్రెండ్ అని.. రియల్ లైఫ్ లో కూడా నేను అలానే ఉంటా అంటూ చెప్పుకొచ్చింది. ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి నాకు ఎప్పుడూ ఉంటుంది అంటూ వెల్ల‌డించింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాపం ఆదిత్య రాయ్‌ కపూర్ ని కూడా ఇలానే టార్చర్ చేస్తున్నావా అనన్య అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇక ఆదిత్య, అన‌న్య మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక గతంలో వీరిద్దరి ఫారిన్ ట్రిప్స్‌లో ఎంజాయ్ చేసిన‌ పిక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి.