న్యూయార్క్ లో ఆమెతో చట్టపట్టలేసుకొని తిరుగుతున్న విశాల్.. కెమెరా కనిపించగానే ముఖం దాచి పరిగెత్తిన హీరో..?!

కొలివుడ్ స్టార్ హీరో విశాల్ కు ప్రత్యేక స‌రిచ‌యం అవసరం లేదు. టాలీవుడ్‌లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న విశాల్ ప్రస్తుతం ప‌లు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అచ్చ తెలుగు అబ్బాయి అయినప్పటికీ.. చెన్నైలో మంచి క్రేజ్‌తో అక్కడే స్టార్ హీరోగా సెటిలైపోయాడు. ఇక టాలీవుడ్ లో కూడా విశాల్ నట‌న‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడుగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ నిర్మించిన‌ ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. 48 ఏళ్ళు ఉన్న విశాల్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక విశాల్‌కు లవర్ కూడా లేడు. అయితే గతంలో విశాల్‌ ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఎఫైర్‌లు న‌డిపిన‌ట్లు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా విశాల్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికి సింగల్ గా ఉంటూ సినిమాలతో బిజీ లైఫ్ గ‌డుపుతున్న విశాల్‌ తాజాగా ఓ అమ్మాయి తో కెమెరాకు చిక్కాడు. రెడ్ కలర్ హుడి వేసుకుని విశాల్ న్యూయార్క్ నగరం రోడ్లపై చట్టపట్టలేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇది గమనించిన ఓ నెటిజన్.. ఈ హీరోకు తెలియకుండా వీడియో తీస్తూ.. విశాల్ అని పిలిచాడు.

అలా పిలవగానే షాక్ అయిన విశాల్ తనను వీడియో తీస్తున్నారని గమనించి తలపై ఉన్న క్యాప్ తో ముఖం కనిపించకుండా కవర్ చేసుకొని ఆ అమ్మాయితో కలిసి పరిగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట‌ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అతను హీరో విశాలేనా.. లేదా హీరో విశాల్ ముక్క కవళిక‌లు కలిగి ఉన్న వేరే అబ్బాయా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోను తమిళ్ క్రిటిక్ రమేష్ బాల తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.