చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసమే..!

సాధారణంగా చాలామందికి తమ జుట్టు అంటే ఎంతో ఇష్టం. జుట్టు అనేది ఒక్క ఆడవారికి మాత్రమే ఇష్టం కాదు మగవారికి సైతం ఇష్టం. దీనికోసం అనేక హెయిర్ క్రీమ్స్, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అయితే జుట్టుకి అనేక హెయిర్ ఆయిల్స్, ట్రీట్మెంట్స్ చేపించుకోవడం ద్వారా జుట్టు రాలిపోతుంది. అదేవిధంగా చుండ్రు ఉండడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ల కోసమే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. నిమ్మ, కొబ్బరి నూనె:
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేసి కొద్దిగా నిమ్మరసం మిశ్రమంలో కలిపి హెయిర్ కి పట్టించాలి. అలా రాసిన 20 నిమిషాలకి హెడ్ బాత్ చేస్తే చుండ్రు పోతుంది.

2. మెంతులు:
మెంతులను నానబెట్టి.. వాటిని పేస్ట్ లా చేసుకున్న అనంతరం కొద్దిగా ఆయిల్ కలిపి తలకి అప్లై చేయడం ద్వారా చుండ్రు సమస్య పోతుంది.

3. వేప రసం:
వేప రసం జుట్టుకి అప్లై చేయడం వల్ల తలలో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోయి జుట్టు హెల్దిగా పెరగడానికి సహాయపడుతుంది.

ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చుండ్రు నుంచి విముక్తి పొందండి.