ప్రభాస్ వదిలేసిన సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేశ్..ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం . దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అయితే చాలామంది స్టార్ హీరోస్ అలాగే ఒక హీరో వదిలేసిన కథతో హిట్ కొట్టి లైఫ్ లో సెటిలైపోయారు . అదే లిస్టులోకి వస్తాడు మన మహేష్ బాబు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు చేసిన ఆల్ మోస్ట్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని మొదట ఆయన దగ్గరికి వచ్చిన కథలు కాదు .

ఆ హీరో రిజెక్ట్ చేస్తే ఈ హీరో రిజెక్ట్ చేస్తే వచ్చిన కధలే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – రవితేజ లాంటి స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలను మహేష్ బాబు చేసి హిట్ కొట్టాడు. అదే లిస్టులోకి వస్తుంది ఒక్కడు. ఒక్కడు సినిమా కథను ముందుగా డైరెక్టర్ ప్రభాస్ కి వివరించారట . ఆయన రిజెక్ట్ చేయడంతోనే మహేష్ బాబు వద్దకు వచ్చిందట. మహేష్ బాబుకు కూడా ఈ కథ నచ్చలేదట.

కానీ సూపర్ స్టార్ కృష్ణ గారే దగ్గరుండి మరీ ఒప్పించి చేయించారట. ఈ సినిమా ఆయన కెరియర్ ని ఎలా మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ప్రజెంట్ ఈ హీరో గుంటూరు కారం సినిమా లో చేస్తున్నాడు ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అంటున్నారు జనాలు..!!