సందీప్ రెడ్డి.. నాగచైతన్యతో మూవీని తీయకపోవడానికి కారణం అదేనా..?!

సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో మారు మోగిపోతుంది. ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి.. మొదట అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అవడంతో హిందీలో కూడా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగ‌ అక్కడ కూడా అదే విధంగా విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా యానిమల్ సినిమా రిలీజై భారీ సక్సెస్ అందుకోవడంతో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమాకు బెస్ట్‌ రివ్యూస్ ఇచ్చారు.

కంటెంట్‌ చాలా బ్రిలియంట్‌గా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఎటువంటి సినిమాకైనా ట్రోల్స్ కచ్చితంగా ఉంటాయి. తండ్రి, కొడుకులు బంధాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి తన స్థాయిలో రూపొందించారని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే యానిమల్ రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను సొంతం చేసుకుంది. అయితే అర్జున్ రెడ్డి కంటే ముందు సందీప్ అంతకుమించి బోల్డ్ కంటెంట్ స్టోరీని నాగచైతన్య కోసం రాసుకున్నాడట. ఒక స్టార్ ఫ్యామిలీ కి సంబంధించిన హీరో అలాంటి సబ్జెక్ట్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయర‌నే భయంతో ఆ మూవీ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత అర్జున్ రెడ్డి స్టోరీ తో మొదటి శర్వానంద్‌ను కలిసాడ‌ట.. అయితే కథ నచ్చిన అలాంటి కంటెంట్ లో సినిమా చేయాలని ధైర్యం చేయలేదట శ‌ర్వానంద్. అదే టైంలో పెళ్లిచూపులు సినిమాతో సక్సెస్ అందుకున్న మీడియం రేంజ్ హీరో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీయాలని భావించిన సందిప్ విజ‌య్‌కి కథ వివరించాడు. విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాను తీసి సక్సెస్ సాధించారు. ఇక తన నెక్స్ట్ సినిమాలను లైన్లో ఉంచుకున్నాడు సందీప్. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబులతో సినిమాలు చేయబోతున్నాడట. ఇక నాగచైతన్యతో అనుకున్న ఆ ప్రాజెక్టును ఎప్పుడు తెరకెక్కిస్తాడో వేచి చూడాలి.