” హాయ్ నాన్న ” మూవీపై నాని వైఫ్ అలాంటి పోస్ట్…!!

కొన్ని సినిమాలు చూస్తే.. తెలియని పులకరింత వస్తుంది. ఆ సినిమాలు చూడడం వల్ల ప్రేమలు సైతం పుట్టుకొస్తాయి. ఇక ప్రస్తుతం ఇప్పుడు ” హాయ్ నాన్న ” సినిమా చూస్తే కొంతమంది ప్రేక్షకులు అచ్చం ఇలానే అనుకుంటున్నారట. ఇవి మేం చెబుతున్న మాటలు కాదండోయ్… సోషల్ మీడియా మేజర్స్ కామెంట్స్ చేస్తున్న మాటలు.

ఇవంతా నాని, మృణాల్ ఠాకూర్ అభిమానుల మాటలు. ఇక వీటిపై నాని భార్య అంజన ఏం చెప్పిందంటే… ఈమె.. నాని తన కుమారుడితో కలిసి చూస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ” ఈ సినిమా చూసిన అందరికీ.. వాళ్లకు ఇష్టమైన వారిని హద్దుకోవాలనిపిస్తుంది ” అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.

ఇక అంతే కాకుండా ఈ సినిమా చూసినంత సేపు నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు అంటూ పోస్టులో రాసుకుంది. ఇక శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నాని భార్య చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.