బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన మూవీ ” యానిమల్ “. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో రాబడుతూ దూసుకుపోతుంది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె మాట్లాడుతూ…” మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటీ నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.
ఇక నాకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. ఆ పాత్రలో నటించిన ప్రతి సీను కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. చిత్రీకరణలో మూవీ టీం తో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.