ఆ సీనియర్ జర్నలిస్ట్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన రేణు దేశాయ్… కారణం ఇదే…!!

సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ అన్ని తెలుసు అని అనుకుంటారు కానీ.. చాలా విషయాలు తెలియనివి ఉంటాయి. అలాంటివి చెబుతాం అంటూ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వస్తూ ఉంటారు. ఇక గతంలో కొంతమంది అక్కడక్కడ వ్యాసాలు రాసేవారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగానికి వచ్చేసరికి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా తన గురించి, తన కుటుంబం గురించి కొన్ని విషయాలు చెబుతూ ఓ సీనియర్ జర్నలిస్టుకు నటి రేణు దేశాయ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది.

ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్.. ఓ పెద్ద కామెంట్ పెట్టింది. అందులో ఆమె బాధతో పాటు.. ఇలాంటి కామెంట్లు పడుతున్న ప్రతి ఒక్క మహిళ గురించి ప్రస్తావించింది . చాలా కాలం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ అలరించే ప్రయత్నం చేసింది రేణు. అయితే ఆ సినిమా నిరాశపరిచింది. ఇక ఈమె మళ్లీ తెరపైకి రావడం పై ఓ జర్నలిస్ట్ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు.

అందులో ఆమె వ్యక్తిగత విషయాల పైన ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు అలా అలా రేణు దేశాయ్ వరకు చేరుకున్నాయి. అందులో కొన్ని మాటలని కట్ చేసి.. మొత్తంగా ఓ వీడియోను చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది రేణు. అలాగే ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సాధించారు. ఈ క్రమంలోనే మహిళలను తక్కువగా చూడడం తగదని సలహా ఇచ్చారు. ” అంకుల్ మీరు నా గురించి మాట్లాడి వ్యూస్ సంపాదిస్తున్నారు. నా పేరు వాడుకుని డబ్బులు సంపాదించుకునేందుకు ఆనందమే.

కూర్చొని నటనపై గాసిప్స్ చెప్పే కంటే మీ టాలెంట్ తో సంపాదిస్తే ఇంకా బాగుంటుంది. ఎంత వయసు వచ్చినా తరువాత కూడా మీరు ఇలా చేస్తే ఎలా. మిమ్మల్ని నేనెప్పుడూ కలవలేదు. నా గురించి మీకు తెలియదు. కానీ నాపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ” అని పేరు ఎత్తకుండానే కౌంటర్ వేసింది రేణు. ఇక అంతే కాకుండా ఈయన ఈమె గురించి మాట్లాడినందుకే.. ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.