బాలీవుడ్ మోజులో.. ఇంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ తమ రూల్స్ బ్రేక్ చేశారా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాము పెట్టుకున్నా రూల్స్ ను వాళ్లే బ్రేక్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అయితే అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బోల్డ్ గా నటించిన ఆ ముద్దుగుమ్మల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

తమన్నా:


ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన తమన్నా.. టాలీవుడ్ అగ్ర హీరోలా అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన బ్యూటీ కొన్నాళ్ళు పాటు ఫ్లాప్స్ ఎదురవడంతో సినిమాలకు దూరమైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ముద్దు, బాల్డ్‌ సీన్స్, ఐటమ్ సాంగ్స్ లాంటి రూల్స్ ను బ్రేక్ చేసింది. లవ్ స్టోరీ, జికర్దాలో తన బోల్డ్ పర్ఫామెన్స్ తో ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. తమన్నా ఇలాంటి సెన్సేషనల్ డెసిష‌న్‌ తీసుకోవడం ఫాన్స్ కు కూడా నిరస కలిగించింది.

సమంత :


సౌత్ స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇటీవల నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే టాలీవుడ్ లో సమంత కూడా ముద్దు సీన్లు, బోల్డ్ కంటెంట్ కు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో బోల్డ్‌ సీన్స్ లో నటించింది. ఆ తర్వాత పుష్పాలో ఊ అంటావా మామ ఉఉ అంటూ ఐటెం సాంగ్ కు చిందేసి ఫాన్స్ ను ఆకట్టుకుంది.

కీర్తి సురేష్ :


టాలీవుడ్ లో మొద‌టి నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. సావిత్రి బయోపిక్ మహానటితో కోట్లాదిమంది ప్రేక్షకుల ఆదరణను పొందింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటల్లో టూ మచ్ గ్లామర్ షో చేస్తూ సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి స్టెప్పులేసింది. తర్వాత హాట్ ఫోటో షూట్లతో కుర్రాలకు కాకరేపుతూ మేకర్స్ కంటపడింది. ప్రస్తుతం vd18 తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ.

రష్మిక మందన :


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అయితే ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్నా కూడా బాలీవుడ్ లో హిట్ కోసం ఏకంగా రణబీర్ తో బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినా.. యానిమల్ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ కంటెంట్ కు ఎన్నో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో చర్చలు జరిగాయి. మొన్నటి వరకు బోల్డ్ సీన్స్ లో నటించని రష్మిక తన రూల్స్ బ్రేక్ చేసి మరి యానిమల్ లో నటించింది.

మెహరీన్ :


మెహరీన్ కూడా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అయితే మొదటి నుంచి బోల్డ్ సీన్ల‌కు దూరంగా ఉంటున్న మెహరీన్ ఎఫ్2 తో రూటు మార్చింది. పిరియాడికల్ ఆక్సిజన్ కథాంశంతో తెరకెక్కిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలు నటించింది. ఇన్నాళ్లు పెద్దతరపై పద్ధతిగా కిస్ సీన్ల‌కు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ లో, రేప్ సీన్ లో నటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

అనుపమ పరమేశ్వరన్ :


టాలీవుడ్ హ్యాట్రిక్ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కెరీర్ ప్రారంభించి పద్ధతిగా మెరుస్తూ ఉంది. ఈ మధ్యలో తన సినిమాలకు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. ట్రెడిషనల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న అనుపమ.. 2021 తర్వాత రొమాన్స్ లో రెచ్చిపోతుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయినా తెలుగులో వచ్చిన రౌడీ బాయ్స్ మూవీలో లిప్ లాక్ సీన్తో ఆకట్టుకుంది. ఫ్రీడమ్ @ మిడ్ నైట్ లోను కాస్త డిఫ‌రెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాలో మరింత బోలెడు కంటెంట్ లో నటించబోతుందో అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.