“కుర్చీ మడతపెట్టి” అంటూ..కాంట్రవర్షియల్ పోలిటికల్ డైలాగ్ ను టచ్ చేసిన మహేశ్ బాబు(వీడియో)..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల – మహేష్ బాబు ఈ సినిమాలో బావ మరదలుగా కనిపించబోతున్నారట .

అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన మాస్ మసాలా సాంగ్ కూడా రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో ఈ సాంగ్ అద్దిరిపోబోతున్నట్లు సింగిల్ ప్రోమోతోనే తెలిసిపోతుంది. అయితే ఈ పదాన్ని కాంట్రవర్షియల్ గా చూపిస్తున్నారు జనాలు . గతంలో తెలంగాణ పాలిటిక్స్ లో ఈ పదం ఎంత పాపులారిటీ దక్కించుకుందో మనకు తెలిసిందే. టోటల్ రాష్ట్రాన్ని షేక్ చేసి పడేసింది.

అలాంటి పదాన్ని గుంటూరు కారం సినిమాలో తన సాంగ్లో ఉపయోగించుకోవడం మహేష్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాటలు ఎలా ఉన్నా కానీ బీట్ అయితే మాత్రం అద్దిరిపోయింది . నాలుక మడతపెట్టి మరి శ్రీ లీలా మహేష్ బాబు ఇరగదీసారనే చెప్పాలి. ఈ ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ఈ సినిమా అతడు కు మించిన హిట్ అవుతుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!