సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిజినెస్ రంగాల్లోనూ రాణిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన లాభాలను బిజినెస్ లో పెట్టి తమ ఆస్తులను రెట్టింపు చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ తమ బిజినెస్ల ద్వారా కూడా అర్జిస్తున్నారు.
ఇక ఈ విషయంలో నేను చాలా వీక్ అంటూ రామ్ చరణ్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమాలు, మూవీ ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ వ్యాపారమైన నేను చేయగలను. అవి మాత్రమే నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ నేను ఓ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. అంకెలతో డీల్ చేయడం నాకు రాదు. రెండు పడవలపై నేను కాళ్లు పెట్టలేను.. ఓకే పడవపై ప్రయాణించడం నాకిష్టం అదే యాక్టింగ్ అంటూ వివరించాడు.
ఇక చెర్రీ సినిమా విషయాలకు వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫెమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు.