వామ్మో..ఎన్టీఆర్ జాతకంలో అలాంటి దోషం ఉందా..? నందమూరి ఫ్యాన్స్ కి వణుకు పుట్టిస్తున్న వేణు స్వామీ మాటలు..!!

వేణు స్వామి .. ఈ పేరు చెప్తే “వావ్” అనే జనాలు కన్నా “వామ్మో” అనే జనాలే ఎక్కువ . అంతలా వివాదాస్పదంగా మారిపోయాడు . వివాదాస్పద విషయాలను టచ్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నాయి. పలు స్టార్ సెలబ్రెటీస్ విషయాలను బాగా ఓపెన్ గా చెప్పేసే వేణు స్వామి .. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

వేణు స్వామి ని ఎన్టీఆర్ తల్లి షాలిని ..తిరుమల లో కలిసింది అని .. అప్పుడే ఆయన జాతకం గురించి చెప్పగా షాక్ అయిపోయిందని .. కేవలం ఎన్టీఆర్ కి పెద్ద ఎన్టీఆర్ కి హరికృష్ణ కి తనకి తెలిసిన విషయం మీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయిందని చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందట. ఆ దోషాన్ని ఇప్పటివరకు బయట పెట్టలేదట ఎన్టీఆర్ తల్లి షాలిని .

అంతేకాదు ఎన్టీఆర్ 2030 వరకు రాజకీయాలకు రానివ్వకుండా షాలిని అడ్డుకుంటుందట . ఆ తర్వాత మాత్రం రాజయోగం ఉందని.. తాత గారి తర్వాత అలాంటి స్థానాన్ని అందుకోబోతున్నాడు అని చెప్పుకొచ్చాడు . అయితే జాతకంలో దోషం ఏంటి అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్ టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై టెన్షన్ పడుతున్నారు..!!