14 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ కు గుడ్ బై చెప్తున్నా ఆ స్టార్ హీరోయిన్.. విడాకులకు సిద్ధమైన నాగార్జున బ్యూటీ..?!

సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో డివోర్స్ చాలా సర్వసాధారణమైపోయింది. చాలామంది స్టార్ కపుల్స్ ఇప్పటికే విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారంటూ వార్తలు వినిపించగా తాజాగా వీళ్ళ కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ ఈవెంట్లో ఈ జంట‌తో పాటు బ‌చ‌న్‌ ఫ్యామిలీ అంతా వచ్చి ఎంతో అన్యోన్యంగా కనిపించడంతో డివోర్స్ వార్తలకు చెక్ పడింది. తరువాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక డివోర్స్ అంటూ కూడా వార్తలు వినిపించాయి.. జ్యోతిక ఇటీవల ఓ వీడియోతో దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక ప్రస్తుతం మరో జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో నాగార్జునతో కలిసి చంద్రకళ సినిమాలో నటించిన హీరోయిన్ ఇషా కొపికర్ తన భర్త టిమ్మి నారంగ్‌తో విడిపోతుందంటూ సమాచారం. 14 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో స్వ‌స్థి చెపాల‌ని భావిస్తున్నారట. కొంతకాలంగా వీరిద్దరి మధ్యన వ‌స్తున్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. విడిపోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారట. గత నెలలో వీరు డిబోర్స్‌కి అప్లై చేశారని.. ఇప్పటికే ఈషా తన కూతురిని తీసుకొని భర్త నుంచి దూరంగా వచ్చేసిందని వార్తలు వినిపించాయి.

Isha Koppikar Timmy Narang Wedding Anniversary Actress Arrived With 20  Girls On The First Date Know Love Story - Entertainment News: Amar Ujala -  Isha Koppikar Love Story:टिम्मी संग पहली डेट पर

తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ నేనేమీ చెప్పాలని అనుకోవడం లేదు.. నాకు ప్రైవసీ కావాలి దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఈషా కామెంట్స్ చేశారు. దీంతో వీరిద్దరూ డివోర్స్ వార్త‌ల‌కు ఆజ్యం పోసిన‌ట్లైంది. హీరోయిన్ ప్రీతిజింతా ద్వారా ఇషా, టీమ్మీ ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 2009లో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2014లో రియానా అనే పాప పుట్టింది. ఇక 2000 లో పిజ్జా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాష మరాఠీ భాషలో నటించి మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది.