ఆ పొలిటీషియన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీనా..?!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి పాపులాటి దక్కించుకుంది. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే మీనా గత ఏడాది తన భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే.

Actress Meena Exclusive Interview | Meena Second Marriage | Tollywood Interviews | TEW - YouTube

భర్త చనిపోయిన రెండు మూడు నెలలకే మీనా తన పాప కోసం రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మాట్లాడుతూ తన రెండవ వివాహం పై స్పందించింది. నేను హీరోయిన్గా చేసిన రోజుల్లో ఎప్పుడు గ్లామర్ పాత్రలు హద్దు మీరలేదని.. ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ గా నటిస్తున్న ప్రతి ఒక్కరి గ్లామర్ రోల్స్ హద్దు మీరే ఉంటున్నాయి.. నా భర్త చనిపోయాక చాలామంది నాపై ఎన్నో రకాల వార్తలు రాసుకోవచ్చారు అంటూ చెప్పుకొచ్చింది.

Koffee with DD - Watch Episode 2 - Meena and Kala's Fun, Fab Chat on Disney+ Hotstar

నేను ధనుష్ ని రెండో వివాహం చేసుకోబోతున్నానని, ఓ రాజకీయ నాయకుడితో పెళ్లి కాబోతున్నాన‌ని, బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుంటున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు నాపై ప్రచురించారు. నేను ఎన్నిసార్లు దీనిపై క్లారిటీ ఇచ్చిన ఈ వార్తలు ఆగడం లేదు అంతేకాదు నా భర్త చనిపోయే ముందు నాకు అతనితో ఏవో గొడవలు ఉన్నాయంటూ కూడా ప్రచారం చేశారు. వీటిల్లో అసలు వాస్తవాలు ఏవీ లేవు.. ఇలాంటి వార్తలు రాసేముందు కాస్త మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అంటూ మీనా కోరుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మీనా ఫ్యాన్స్ మీరు బాధపడకండి మేడం.. వాటన్నిటిని ఎవరు నమ్మరు.. మీరు స్పష్టం చేస్తే తప్ప ఆ పుకార్లను ఎవరు పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.