రాజమౌళి మూవీ రికార్డులను బ్రేక్ చేసిన ” సలార్ “… డార్లింగా మజాకానా…!

1 భారీ కలెక్షన్స్ను రాబడుతున్న ఈ మూవీ.. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిన్న మంగళవారం, నేడు కూడా ఈ మూవీ నైజాంలో రూ.5 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసింది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది సలార్.

అంటే ఐదు రోజుల్లోనే రూ. 240 కోట్టు కలెక్ట్ చేయడం జరిగింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.500 కోట్ల మార్కిని టచ్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా సలార్ మూవీ ఇప్పుడు సరికొత్త రికార్డుని సృష్టించింది. అదేంటంటే…. ఇప్పటివరకు తెలుగు వర్షన్ పరంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ గా అల్లు అర్జున్ ” అలా వైకుంఠపురములో ” సినిమా నిలిచింది.

ఇక ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ తోనే వరల్డ్ వైడ్ గా రూ. 160 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ రికార్డును సలార్ బ్రేక్ చేసింది. ప్రభాస్ సలార్ మూవీ ఒక్క తెలుగు వర్షన్ లోనే.. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 166 కోట్ల వరకు షేర్ని రాబట్టి.. జక్కన్న సినిమాని పక్కన పడేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ 3 సినిమాలు కూడా.. ప్రభాస్ వే కావడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఉషారుని ఇస్తుంది.