‘ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ ప్రీమియర్ షో టాక్.. మూవీ హిట్టా..? ఫ‌ట్టా..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ తాజాగా నటించిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. గతంలో రేసుగుర్రం, టెంపర్, కిక్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు స్టార్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి కామెడీ బ్లాగ్ ని కడుపుబ్బ నవ్వించే విధంగా తెర‌కెక్కించాడు. రచయితగా గతంలో తాను తీసిన సినిమాలో కామెడీ ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమాలోని కామెడీ ఆ రేంజ్‌లో పండింది.

గ‌త‌ సినిమాల ప్రభావం కూడా ఈ సినిమాలో కాస్త కనిపిస్తుంది. ఇటీవల పాలిటిక్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయినా కొన్ని సంఘటనల ప్రభావాలను కూడా సన్నివేశాలుగా రూపొందించారు. దిల్ రాజు ఇచ్చిన డాన్స్ వెనుమా స్పీచ్ కూడా ఇందులో వాడేసారు. ఫస్ట్ హాఫ్ ముందు వరకు కూడా కామెడీ అన్‌ స్టాపబుల్ గా కొనసాగింది. అయితే బ్రేక్ తరువాత కాస్త జోరు తగ్గింది అనిపించినా నితిన్ పర్ఫామెన్స్ లో ఏమాత్రం లోటు కనిపించలేదు. ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో నితిన్ ఆకట్టుకున్నాడు. కామెడీ విషయంలో బాగానే అనిపించినా కథ విషయంలో కాస్త లోగా ఉంది.

హీరో, విలన్ సీన్స్ అయితే అసలు పండలేదు. కథకు సింక్ లేకుండా సీన్స్ ఉన్నాయని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా మొత్తంలో కామెడీకి డోకా ఉండదు. హీరోయిన్ పాత్రను మాత్రం కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితం చేశారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్, సాంగ్ షూటింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్గా ఇతర అంశాలను పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం ఫ‌న్‌ కోసం సినిమాకు వెళ్లే వారికి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఇక ఈ సినిమా వకాంతం వంశీ, నితిన్‌కు కావాల్సిన సక్సెస్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.