శోభ మళ్లీ సేఫ్.. శివాజీ బ్యాచ్ మేట్ డేంజర్ జోన్.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..

ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి వెళ్ళిపోతున్నారు అని ఆసక్తి ప్రేక్షకులను నెలకొంది.

Bigg Boss Telugu 7: Shivaji threatens to leave the house; Tries to stop  from performing task | PINKVILLA

ఈసారి ఓటింగ్ కూడా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో కాస్త రసవత్తరంగా మొదలైంది. స్ట్రాంగ్ కంటిస్టెంట్లు నామినేషన్ లో ఉండడంతో ఓటింగ్స్ బాగా నమోదు అవుతున్నాయి. ఫినాలే కావడంతో అంబటి అర్జునుని కూడా ఓటింగ్ లోకి చేర్చాడు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే శివాజీ బ్యాచ్ స్ట్రాంగ్ కంటిస్టెంట్లుగా నామినేషన్లు భారీ ఓటింగ్ తో నిలిచారు. కామన్ మ్యాన్ గా వెళ్ళిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో, తర్వాత స్థానంలో శివాజీ ఉన్నారు. అయితే తర్వాత స్థానంలో 18 శాతం ఓటింగ్ దక్కించుకొని యావర్ నిన్న మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న అనూహ్యంగా ఒక్కసారిగా రిజ‌ల్ట్ ఉల్టా అయ్యింది.

Bigg Boss Telugu 7: Tension soars as 'SPY' batch gets targeted - Times of  India

అతని స్థానంలో సీరియల్ బ్యాచ్ లీడ‌ర్ అమ‌ర్ చేరాడు 17.89% ఓటింగ్ తో అమర్ మూడో స్థానంలో, 17. 59 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఎప్పటిలాగే ప్రియాంక, శోభ శెట్టి చివరి రెండు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు ప్రియాంక, శోభలతో పాటు ప్రిన్స్ కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు. దీనికి తోడు మళ్ళీ శోభను సేవ్ చేయడానికి బిగ్ బాస్ మాస్టర్ స్కెచ్ వేసి ప్రిన్స్‌ను ఎలిమినేట్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గతవారం కూడా శోభ శెట్టి డేంజర్ జోన్ లో ఉంటే ఆమెను సేవ్ చేయడం కోసమే గౌతమ్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్ చేశారు.. ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ పలు విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం రాత్రి ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశం తెలుస్తుంది. ఒకవేళ శోభను సేవ్ చేసే ప్లాన్లోనే బిగ్ బాస్ ఉంటే ప్రిన్స్ యావర్ డేంజర్ జోన్ లో పడినట్టే అంటూ నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.