ఆ స్టార్ హీరో సినిమా ద్వార రీఎంట్రీ ఇస్తున్న విజయ్ శాంతి .. ఒక్క ట్వీట్ తోనే చెమటలు పట్టించేసిందిగా..!!

విజయశాంతి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇప్పటి తరం హీరోయిన్లందరూ అందంతో ఎక్స్పోజింగ్ తో పాపులారిటీ సంపాదించుకుంటే.. విజయశాంతి మాత్రం యాక్షన్ సీన్స్ లో ఫైట్ సీన్స్ లో నటించి లేడీ డైనమిక్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆమె నటిస్తే స్టార్ హీరోకి కూడా చెమటలు పట్టాల్సిందే . అలాంటి టాలెంట్ గల నటి విజయశాంతి .

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా చేసిన విజయశాంతి .. ఆ తర్వాత సీనియర్ పాత్రలు కూడా చేసింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపించబోతుంది . ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోస్ట్ చేసింది . గతంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు కళ్యాణ్రామ్ నటిస్తున్న సినిమాలో కూడా నటించబోతుంది.

ఈ క్రమంలోనే ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయింది . “నన్ను తమ ప్రాణంగా భావిస్తూ ..జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు. ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీకోసం.. నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు .. ఐదు దశాబ్దాల ఈ నా సినీ గమ్యంలో మీ దీవెనలు ఎన్నటికీ.. 1979 నుంచి నేటి వరకు ఉన్నట్లు మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లానే ఉంటాయని ఆశిస్తున్నాను”..అంటూ పోస్ట్ చేసింది..!!