ప్రభాస్ ని అస్సలు నమ్మకండి.. ముందు ఒకలా.. వెనక ఒకలా ఉంటాడు”.. స్టార్ హీరో కూతురు సెన్సేషనల్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ అభిమానులకి కోపం తెప్పిస్తున్నాయి . సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి. అది కూడా సలార్ నటి చెప్పడం ఇప్పుడు ఇంకా ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సలార్ సినిమాలో శృతిహాసన్ ఆయనకు జోడిగా నటించింది .

 

సినిమాలో వీళ్ళ మధ్య సీన్స్ చాలా తక్కువ అయినప్పటికీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . “ప్రభాస్ ని అసలు నమ్మకండి తన ముందు ఒకలా..? తెర వెనక ఒకలా ఉంటాడు. కెమెరా ఆన్ చేయకముందు వరకు చాలా జోవియల్ గా సరదాగా మాట్లాడుతుంటాడు. కెమెరా ఆన్ చేయగానే వెంటనే వేరే పరకాయ ప్రవేశం చేసేస్తాడు “.

“పూనకాలు వచ్చినట్లు ఊగిపోతు నటించేస్తాడు . అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ప్రభాస్ వెంటనే ఎమోషనల్ సీన్స్ కి ఎలా కనెక్ట్ అయిపోయాడో నాకు తెలియదు. వైలెన్స్ సీన్స్ కూడా అంతే వైలెంట్ గా నటిస్తాడు .నిజంగానే ప్రభాస్ మల్టీ టాలెంటెడ్” అంటూ పాజిటివ్ గా కామెంట్ చేసింది . అయితే శృతిహాసన్ కామెంట్స్ ని ద్వంద అర్థాలు తీసుకొస్తూ కొంతమంది ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!