హమ్మయ్య.. ఫైనల్లీ “దేవర” సినిమాలో సెకండ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల.. తారక్ కి పర్ఫెక్ట్ జోడీ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరా.. ఎవరా.. ఎవరా అంటూ బుర్ర పీక్కున్న జనాలకు ఫైనల్లీ ఓ కంక్లూజన్ వచ్చేలా చేసేసాడు కొరటాల శివ . ఆచార్య లాంటి డిజాస్టర్ అందుకున్న తర్వాత కొరటాల శివ ఎంతో కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమాను ఓకే చేశారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . రెండవ హీరోయిన్గా ఎవరబ్బా అంటూ చాలా రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ చర్చలు వినిపిస్తున్నాయి . అయితే ఒకసారి ఆలియా ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత రష్మిక మందన్నా అంటూ రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి.

ఫైనల్లీ ఆ ప్లేస్ లోకి సాయి పల్లవి వచ్చేసింది . సినిమా కథ ..కంటెంట్ బట్టి ఎక్స్పోజింగ్ లేకుండా ట్రెడిషనల్ లుక్స్ లో ఉన్న హీరోయిన్ బాగుంటుంది అంటూ కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నారట . దీంతో స్క్రీన్ పై వీళ్ళిద్దరూ స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఊహించుకొని మరి ఈ న్యూస్ను ఫ్రెండ్ చేస్తున్నారు..!!