” వెంకీ 75 ” ఫంక్షన్లో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చిన చిరు..!

వెంకటేష్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న వెంకీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే వెంకి 75 సినిమాలు కంప్లీట్ అవ్వడంతో హైదరాబాద్లో ఓ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.

Chiranjeevi : వెంకటేష్ హీరో అయితే నా పరిస్థితి ఏంటి అని భయపడ్డాను..  చిరంజీవి వ్యాఖ్యలు.. | Chiranjeevi interesting comments on venkatesh at venky  75 event-10TV Telugu

ఈ ఫంక్షన్ కి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్ కెరీర్లో 75 సినిమాలు పూర్తి చేసిన డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఇక వీరంతా ఈ ఫంక్షన్ కి హాజరై ప్రేక్షకులని అలరించారు. ఇక ఈ వేడుకలో స్టేజ్ పై జరిగిన ఓ చిన్న సంఘటన ఫ్యాన్స్ కి అదిరిపోయే కిక్ ఇచ్చింది.

ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ గ్యాంగ్ లీడర్ మూవీ లోని ” చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో ” అనే డైలాగులు చెప్పారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గణేష్ మూవీలోని ” సింగిల్ హ్యాండ్ గణేష్ ” అంటూ ఫేమస్ డైలాగ్ ను చెప్పుకొచ్చారు. ఇక వీరు చెప్పిన ఈ డైలాగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.